యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్ట్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీబీనగర్ లో వున్న సెంటర్ దూరంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయని, భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త గా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ లు వాడాలని కోరారు. ఈ రోజు 74 మందికి టెస్ట్ చెయ్యడం జరిగింది. ప్రతి రోజు దాదాపు గా 75 మందికి టెస్ట్ లు చేస్తారని జిల్లా వైద్యాధికారి సాంబశివ రావ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల వైద్య అధికారి కే. లీలా వతి, డాక్టర్ మురళి, వైస్ చైర్మన్ చింతల క్రిష్టయ్య, వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ తదితరులు పాల్గున్నారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more