ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ముఖ్యఅతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్
విశిష్ట అతిథులుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
ఈ రోజు రవీంద్ర భారతి లో మధువన్ కేపీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు మరియు క్లాసికల్ డాన్స్, చేసిన వారికి మెమెంటోస్ సర్టిఫికెట్స్అంద చేశారు. వికలాంగులకు డ్రెస్ మెటీరియల్స్, మెమెంటోస్ తో సత్కరించడం జరిగింది.. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ తామేదైనా కోల్పోతే కానీ.. ఆ విలువ తెలియదని అంటూ ఉంటారు. అలాంటి కష్టాలు తెలుసుకున్న శ్రీమతి మాధవి ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టు ద్వారా బడుగు బలహీన వర్గాలకు, అభాగ్యులు, అనాధలకు అండగా నిలుస్తూ ఉండడం అభినందనీయమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. జర్నలిస్టుగా ఆమె తన విధులు నిర్వర్తిస్తూనే.. సమాజ సేవలో, నేనున్నాను అంటూ ఆమె ముందుకు వచ్చారని ఆమెను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుని పలువురికి సహాయం చేయాలని దుండ్ర కుమారస్వామి పిలుపును ఇచ్చారు. శ్రీమతి మాధవి, ఆమె భర్త పవన్ కుమార్ లను అభినందిస్తున్నానని దుండ్ర కుమారస్వామి అన్నారు.
అభాగ్యులకు ఏదో ఒక మంచి చేయాలని అనుకునే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి.. కుటుంబం అన్నాక అవసరాలు సర్వ సాధారణం, కానీ సమాజాన్నే తన కుటుంబమనుకుని సహాయం చేయాలని దుండ్ర కుమారస్వామి పిలుపును ఇచ్చారు. అవసరం కోసం ఎదురుచూస్తూ ఉన్న ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచినప్పుడే మన జీవితానికి సార్థకత అని అన్నారు కుమారస్వామి. ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతలు మిన్న అని ఊరికే అనలేదు.. సాయం కావాలి అని ఎవరైనా అడగకముందే సాయం చేసి మన గొప్పతనాన్ని మనం నిరూపించుకోవాలి. ఎవరో సమస్యలో ఉన్నారు అని వారిని చూసి అయ్యో.. పాపం అని అనుకోవడం వేరు.. నేను ఉన్నాను, నేను సాయం చేస్తాను అని వెళ్లి సాయపడడం వేరని దుండ్ర కుమారస్వామి అన్నారు.
తోటి వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు సాయం చేసే గుణం ప్రతి ఒక్కరికీ ఉండాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. నేటి యువత కూడా ఇతరులకు సాయం చేయాలని అనుకోవాలని.. అలాంటప్పుడే సమాజం మరింత గొప్పగా మన కంటికి కనపడుతుందని దుండ్ర కుమారస్వామి అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా నెగటివిటీ అన్నది సర్వ సాధారణం అయిపోయింది.. మనుషులు పాజిటివ్ గా ఆలోచించాలి.. సాయం చేస్తే వాళ్ల లైఫ్ బాగుంటుందేమో అనే చిన్న థాట్ మీలో రావాలి.. మనం చేసిన సాయం ఏదో ఒక రోజు మన దాకా రావచ్చు. పేదవారికి తోచిన సాయం చేయడమనేది పూర్వజన్మ సుకృతంగా భావించాలి.. ఒక పాత టీషర్టుని ఓ నిరుపేద కుర్రాడికిచ్చినా, మన ఇంట్లో తినగా మిగిలిపోయినవి ఆకలితో అలమటిస్తున్న వారికి ఇచ్చినా మీరు సాయం చేసిన వారే అవుతారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ , విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, దుండ్ర కుమారస్వామి, సభాధ్యక్షులుగా మాధవన్ ట్రస్ట్ చైర్మన్ మాధవి, శైలజ , మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి , పద్మ,దివ్య మరియు దైవజ్ఞశర్మ ,హయత్ నగర్ కార్పొరేటర్ సుజాత,ఏం సందీప్ కుమార్ చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ స్కిల్ ఇండియా మిషన్ మరియు ఇతరులు పాల్గొన్నారు