హుజురాబాద్ : ప్రజా దీవెన యాత్ర 5 వ రోజు జమ్మికుంట మండలం వావిలాల నుండి పాపక్కపల్లి కి సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా, పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ పట్ల ఈటెల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
2018 లోనే నా గొంతుక పిసికి, నన్ను ఓడగొట్టడానికి పాడికి పైసలు ఇచ్చావ్. ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నావ్. కేసీఆర్..నాది తప్పయితే ముక్కు నేల రాస్తా.. నువ్వు రాస్తావా… అని ఆవేదన వెళ్లగక్కారు.