బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి పిలుపుమేరకు , ప్రతిరోజూ నిత్యవసర సరుకులు అన్ని ప్రాంతాల నిరుపేదలకు అందిస్తూనే ఉన్నారు. ఈరోజు బీసీ దళ్ ఆధ్వర్యంలో జీడిమెట్ల
కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ జిల్లాలో నిరుపేద కూలీలకు వలస కూలీలకు నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు మరియు కూరగాయలు అందజేయడం జరిగినది. లాక్ డౌన్ వలన అనేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ కార్యనిర్వాహక అధ్యక్షులు జి ఐలయ్య గౌడ్ బియ్యము కూరగాయలు నిత్యావసర సరుకులను 100 మందికి అందజేశారు ఈ సందర్భంగా బీసీ దళ్ నాయకుడు మహేష్ మాట్లాడుతూ సామాజిక దూరం తోనే కరోనా ను కట్టడి చేయాలి అని తెలియజేశాడు., కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, తెలియజేశాడు. అదేవిధంగా లాక్ డౌన్ వలన సెలూన్ షాపులు మూసివేయడం వలన కటింగ్ వృత్తి చేసుకునే నాయి బ్రాహ్మణులకు ఉపాధి కోల్పోయారని, ఉపాధి కోల్పోయిన నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వము సహాయ సహకారాలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఐలయ్య , కే మహేష్ ప్రభుత్వాన్ని కోరారు.
.
.