కరుణ వ్యాధిని కట్టడి లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం దానిలో భాగంగా అనేక నిరుపేదలైన పెద బ్రాహ్మణులు ఆకలితో ఉండడం, పరిశుద్ధ కార్మికులు అవసరాలను చూసిన శ్రీ రామానుజ యాగ్నిక పీఠం అధ్యక్షులు హైదరాబాద్ శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ చార్యులు స్వామి వారు, ఈరోజు శ్రీమతే రామానుజాయ నమః నమో నారసింహాయ వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారము తారీకు 6 మే రోజున తన సొంత గృహం వద్ద నరసింహ స్వామి జయంతోత్సవం వేడుకలు తన ఇంట్లోనే జరిపినా తదుపరి నిరు పేద బ్రాహ్మణులకు పారిశుద్ధ్య కార్మికులకు, మున్సిపల్ వీధిదీపాల లైన్ మాన్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ,లాక్ డౌన్ మొదటి రోజు నుండి మా యొక్క సంస్థ ద్వారా అనేక నిరుపేద బ్రాహ్మణులకి, పారిశుద్ధ్య కార్మికులకు మరియు బడుగు బలహీన వర్గాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలియజేశాడు.ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తప్పకుండా పాటించాలి , ప్రతి ఒక్కరూ కూరగాయలకు కొనుటకు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు తప్పక ధరించాలి అని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో
యాగ్నిక పీఠం సభ్యులు చక్రవర్తి లక్ష్మణా చార్యులు , చక్రవర్తుల నరసింహాచార్యులు , సద్గుణ చార్యులు చారి సంపత్ కుమార్ ఆచార్యులు వంశీ కృష్ణమాచార్యులు , రాచకొండ ప్రసాద్ శర్మ ,గోవర్ధన వంశీకృష్ణ వెన్నెల గడ్డ ప్రతినిధులు జ్ఞానేశ్వర్ , గుమ్మడి మధుసూదన్ రాజు గారు వెంకటేష్ , రమేష్, భూపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more