రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లొ 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ప్రాంతంలో ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కరోనా
మహమ్మారి విజృంభిస్తున్న, లాక్ డౌన్ లో భాగంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద ప్రజలకు తనవంతు సహాయంగా 20 మంది నిరుపేదలకు బియ్యం మరియు నిత్యావసర సరకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా దొడ్ల వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలను ఆదుకోవడం ఒక అద్భుతమైన పరిణామం అని తెలియజేశాడు.
ప్రతి ఒక్కరూ మనల్ని మనం కాపాడుకోవడానికి మరియు ఇతరులను కాపాడడానికి ఏకైక మార్గం కనీసం ఆరడుగుల బౌతిక దూరం పాటించాలి, మాస్కు ధరించాలి అని తెలియజేశాడు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మరియు వైద్యులు సూచనలు పాటించాలి అని కొంత కొంత కాలం బయట ఆహారం తినడం మంచిది కాదని వీలైనంత వరకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మంచిదికాదని దానికి బదులుగా నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం, నిత్యావసర సరుకులు అందించడం ఒక గొప్ప విషయం అని దానిలో పాల్గొనడం కూడా సంతోషం అని తెలియజేశాడు. ఈ
కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు ,వార్డు మెంబర్ కాశీ, పోశెట్టి గౌడ్ ,బోయ కిషన్, కాసాని శంకర్, నాగభూషణం, కటక రవి, వాసు, గుడ్ల శ్రీను, అర్జున్,రవి , తదితరులు పాల్గొన్నారు.