రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్ మండలానికి చెందిన మన్సురాబాద్ లో బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్, ఆధ్వర్యంలో లో గత 15 రోజుల నుండి నిరంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నాడు. సోమవారం ఎల్బీనగర్ ప్రాంతంలో నిత్యవసర సరుకులు, ఆహార పదార్థాలు మరియు పరిశుభ్రత సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లెల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వ్యాధికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మనమందరం దృఢ సంకల్పంతో తో పోరాడాలి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కరోనా నియంత్రించడం ప్రతి ఒక్కరి భాద్యతని అత్యవసరమైతె తప్ప బయటకు రావద్దని అవగాహణ కల్పించారు. కరోనా వైరస్ తో ప్రపంచం విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. మరియు ఈ లాక్ డౌన్లోడ్ భాగంగా ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో మరింత కఠినంగా ఉండాలని తెలియజేస్తున్నాం. కావున ప్రజలందరు చాలా జాగ్రత్తగా ఉండాలని , మన దేశం లో అమలులో ఉన్న లాక్ డౌన్ ను ప్రజలందరం కలిసి మరింత కఠినంగా చేద్దామని, మన ఆరోగ్యాలను కాపాడుకుందామని తెలియజేశాడు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more