ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని NFC నగర్ కమిటీ హాల్ లో రాచకొండ కమిషనరేట్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, సీఐ చంద్రబాబుతో కలిసి మేడ్చల్ జిల్లా ఎంపీపి ల పోరం అధ్యక్షుడు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టినరోజు సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఎంపిపి గారు మాట్లాడుతూ..
కోటి వెటర్నరీ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు రక్తం లేక ఇబ్బంది పడుతున్నారు, అలాంటి ఇబ్బంది జరగకుండా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికిగాను నా పుట్టినరోజు సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు, నా శ్రేయోభిలాషులు రక్త దానం చేయడం జరిగింది, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రక్త దానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళుము అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, అడిషనల్ సిఐ జంగయ్య, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్,
ఎం పి టి సి శోభ దామోదర్ రెడ్డి, కౌన్సిలర్స్ రమాదేవి పద్మారావు, మల్లేష్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, ఎస్ఐ ధనుంజయ్, విజయ్, కృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు..