ఏ ఆర్ ఆర్ మరియు ఎజీఎస్ మీడియా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘Production Number 1’ షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది. నూతన నటీనటులతో వైవిధ్యభరితమైన కథనంతో నందూ యార్లగడ్డ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారంలో హైదరబాదు పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారభం కానుంది. అద్భుతమైన కథతో సినిమా తెరకెక్కబోతోందని.. ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని దర్శకుడు నందూ యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ చిన్న సినిమాలను ప్రోత్సహించాలని సూచించారు. చిన్న సినిమాలను తక్కువగా అంచనా వేయకూడదని.. గతంలో ఎన్నో చిన్న సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయని అన్నారు. సంవత్సరానికి పెద్ద సినిమాలు మహా అంటే ఒక డజను వస్తూ ఉంటాయని.. మిగతా అంతా చిన్న సినిమాలదే హవా అని అన్నారు కుమారస్వామి. చిన్న సినిమాలను తొక్కేయాలని అనుకుంటే ఎవరికైనా చుక్కలు కనిపించేలా చేస్తాయని తెలిపారు. కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాటను నమ్మి గుండ్ల గణేష్, రవి కుమార్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారని.. ఖచ్చితంగా మంచి విజయం ఈ సినిమా సాధిస్తుందని ఆశిస్తూ ఉన్నానని కుమారస్వామి చెప్పుకొచ్చారు. ఈ చిత్ర నిర్మాతలు గుండ్ల గణేష్, రవికుమార్ YDDలు మాట్లాడుతూ ‘మా డైరెక్టర్ నందు చెప్పిన కథ వినగానే ఎంతో ఆసక్తికరంగా అనించింది. ఈ సినిమా ఖచ్చితంగా మంచి చిత్రం అవుతుందని భావించి, మంచి విజయాన్ని అందుకుంటుందని దృఢంగా నమ్ముతూ వెంటనే ఈ చిత్ర నిర్యాణం ప్రారంభించాము. మా ఈ సినిమా పూజా కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరడం.. స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రేక్షకుల ఆదరణ మా సినిమాపై ఉంటుంది’ అని తెలియజేశారు. సంగీత దర్శకులు ఎం.ఎం. రాజా మాట్లాడుతూ నందు యార్ల గడ్డ గారి మొదటి సినిమాకి నేను మ్యూజిక్ ను అందించడం.. రెండో సినిమాకు కూడా మళ్ళీ సంగీత దర్శకునిగా పని చేయడం చాలా ఆనదంగా ఉందని తెలిపారు. ఆ స్వామి వారి కృపతో ఈ చిత్రం మంచి విజయం సాధించాలని.. చిత్రానికి పని చేసిన వారికి గొప్ప పేరు తీసుకుని రావడమే కాకుండా.. నిర్మాతలకు మంచి లాభాలు అందించాలని కోరుకుంటున్నానన్నారు.కిక్ రాము,అద్యశ్రి,నీహారిక, ప్రణీత రాజ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నందు యార్ల గడ్డ,నిర్మాతలు: గుండ్ల గణేష్, రవికుమార్ YDD సంగీతం: ఎం.ఎం.రాజా, DOP: శ్రీరామ్ ఎడిటర్: తిరుపతి రెడ్డిపాటలు: పెద్దాడ మూర్తిడిజైనర్: రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more