ఈరోజు శేరిలింగం పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్l లో భారతీయ జనతా పార్టీ అద్వర్యం లో ఎల్లమ్మ చెరువు వద్ద చెరువు ల సుందరీకరణ చేయాలనీ అందులోనికి డ్రైనేజి వాటర్ ని వదలకుండా నియంత్రించాలని కాలనీ వాసులకు దుర్వాసన మరియు దోమలబెడద నుండి రక్షించాలని నిరసన దీక్ష చేపట్టడం జరిగింది . దీనిలో భాగంగా బీజేపీ నిరసన దీక్షా శిబిరం వద్దకు వెళ్లి నిరసన దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ . ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత చెరువులన్ని అన్యాక్రాంతం అవుతున్నాయని ,కొన్ని చెరువులు కబ్జాలకు గురై మిగిలిన చెరువులు మురికి నీటితో కలుషితం అవుతున్నాయని అన్నారు . చెరువుల సుందరీకరణ పేర్లతో వందలకోట్లు దండుకొని అవి సుందరీకరణ చేయకపోగా అందులోనికి డ్రైనేజి ని వదిలి చెరువులను పూర్తిగా నాశనం చేస్తూ చుట్టుపక్కల కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని దోమలు, దుర్వాసన వల్ల రాబోయే వర్షాకాలం లో ప్రజలు డెంగ్యూ లాంటి జబ్బులు ,జ్వరాలకు గురి అవుతారని వారు అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే ,కార్పొరేటర్లు వెంటనే ఎల్లమ్మ చెరువు ,ఇతర చెరువుల పై శ్రద్ద చూపి వాటిని బాగుచేసి పూర్తిగా సంరక్షించక పొతే మేము బీజేపీ పార్టీ తరుపున స్థానిక GHMC జోనల్ కార్యలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు ,ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీలు మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more