రంగారెడ్డి జిల్లాలోని శంకర పల్లి మండలానికి చెందిన జొన్నవాడ గ్రామవాసి అయిన శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగ రీత్యా కరెంట్ పోల్ ఎక్కి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెంది నాడు .
ఈ విషయం తెలుసుకుని బిసి దల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన్దాస్, మిర్జాగూడ సర్పంచ్ రవిగౌడ్ ,ఎంపిటిసి కురుమ వెంకటేశ్, ఉపసర్పంచ్ కిషన్ సింగ్,మాజీ సర్పంచులు సంజీవ్ యాదవ్, మల్లేష్ యాదవ్, వార్డు మెంబర్స్ శివ ,రాజు గౌడ్ ,మాజీ వార్డు మెంబర్ జంగయ్య మరియు కార్యకర్తలు ఒగ్గు రాజు, వగ్గు అంజయ్య వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు తగిన ఆర్థిక న్యాయం చేయాలని తెలియజేశారు.