ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్ ఈఫిల్ టవర్. దీనిని 1889లో నిర్మించారు. 1887 జనవరి 28రోజున దీని కట్టడం ప్రారంభమై 1889 మార్చి 15న పూర్తయ్యింది. ఫ్రెంచ్ లోని ఒక సివిల్ ఇంజినీరింగ్ సంస్థ దీన్ని నిర్మించింది. గుస్తావ ఐఫిల్ అనే వ్యక్తి ఈ సంస్థను నడిపేవాడు. ఆయన పేరు మీదుగానే ఐఫిల్ అనే పదం నుండి ఈఫిల్ టవర్ గా పిలుస్తున్నారు.
అయితే ఈఫిల్ టవర్ పైభాగంలో యాంటెన్నాలను అమర్చి దాన్ని ప్రసారాల కోసం వినియోగిస్తారు. కానీ ఈ యాంటెన్నా ను కొన్నిసార్లు అవసరాన్నిబట్టి మారుస్తుంటారు. మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తులో కొంత తేడా వస్తుంది. ఈ మధ్యనే దీనికి డిజిటల్ రేడియో యాంటెన్నాను అటాచ్ చేశారు. హెలికాప్టర్ పైకి వెళ్ళి టవర్ చివరన కొత్త యాంటెన్నాను అమర్చారు. అయితే దీన్ని 10నిమిషాలో అమర్చారు. దీనివలన ఈఫిల్ టవర్ ఎత్తు 6 మీటర్లు పెరిగి 330 మీటర్లు అయింది.