ఈ రోజు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ గెస్ట్ హౌస్, హన్మకొండ నందు మంత్రివర్యులు శ్రీ ఎరబెల్లి దయాకర్ రావు కలుసుకొని తెలంగాణలో రిజర్వేషన్స్ కు నోచుకొని, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ (బ్రాహ్మణ, వెలమ, రెడ్డి, వైశ్య, కమ్మ, మార్వాడి) పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% రిజర్వేషన్ పాథకాన్ని ఈ డబ్ల్యూ ఎస్ (Economically Weaker Section) 10 శాతం రిజర్వేషన్ కోటాను పార్లమెంట్లో 09 జనవరి 2019 తేదీన చట్టం చేసి, దేశవ్యాప్తంగా విడుదలయ్యే ప్రతి నియామక ప్రకటనల్లో EWS కోటాని తప్పనిసరి చేస్తూ, 124 వ రాజ్యాంగ సవరణ ద్వారా EWS Certificate కి సంబంధించి వివిధ మార్గధర్శకాలను విడుదల చేయడం జరిగింది, దానిని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో ను యధావిధిగా అమలు చేయమని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖలల్లో తక్షణం అమలుచేయాలని కోరుతూ OC JAC ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం EWS దృవీకరణ సర్టిఫికెట్స్ ఇస్తున్నప్పటికీ కోటను అమలుపరచకపోవడంవలన గత రెండు సంవత్సరాలుగా అనేక అవకాశాలను కొల్పోయారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంభందించిన కొన్ని పోటీ పరీక్షలలోనూ, నోటిఫికేషన్స్ లలోనూ అదేవిదంగా TS EAMCET లాంటి పోటీ పరీక్షలలో రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థులు, విద్యా-ఉద్యోగ ఆశావహులు తమకు రాజ్యాంగ భద్దంగా లబించిన అవకాశాన్ని కోల్పోయి తీవ్రంగా నస్టపోవడం జరిగింధి, కావున త్వరితగతిన మాయొక్క న్యాయమైన హక్కును రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిదంగా తాము ఏ కులానికి, మతానికి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, అన్ని కులాల్లోని పేదలతో పాటు నిరుపేద ఓసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాది రంగాలలో సమ న్యయం జరగాలన్నదే తమ లక్షమని వక్తలు తెలిపారు.
సంభంధిత మంత్రి ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించవలసిందని కొరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాక్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్ కుమార్, కమ్మ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు శ్రీరామ కృష్ణ ప్రసాద్, కమ్మ సంఘం నాయకులు మందడి కోటేశ్వర రావు, దానేకుల రాంబాబు, జాక్ అధికార ప్రతినిధి బోయినపెల్లి పాపారావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అద్యక్షులు, వంగేటి అశోక్ కుమార్, వైశ్య సంఘం నాయకులు పిల్లలమర్రి కిషోర్, మునిగోటి రమేష్, రెడ్డి సంఘం నాయకులు నాగవెల్లి కేశవ రెడ్డి, రావుల నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more