ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2021 జనగణ లో కుల గణన కోసం మహాఉద్యమం అనే కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద లక్ష పోస్ట కార్డులు, 10 లక్షల ట్వీట్లు అనే మహా ఉద్యమం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా బీసీ దల్ అధ్యక్షుడు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ దళ్ అధ్యక్షుడు మాట్లాడుతూ లక్ష పోస్ట్కార్డులు 10 లక్షల ట్వీట్లు అనే కార్యక్రమంలో యావత్ బీసీ జాతి భాగస్వామ్యం కావాలని మరియు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీ కులాల జనాభా లెక్కలు చేయకపోవడం చాలా బాధాకరమని దీనివలన బిసి జాతిని చీకటిలో ఉంచిన ప్రయత్నం జరుగుతుందని, మన జాతిలో వెలుగులు రావాలి అన్న మరియు బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి జరగాలంటే వెంటనే కులగణన జరగాలని,మన జనాభా 56 శాతం రిజర్వేషన్లు 25 శాతం ఎక్కడి న్యాయం అని ప్రశ్నించారు. కడుపు కాలిన బీసీ జాతి ఓట్లు తూటాలు గా మారితే కేంద్ర ప్రభుత్వా నిలబడగలదా అని ప్రశ్నించారు. బీసీ జాతికి కుల గణన అనేది ప్రాణవాయువు లాంటిది దానిని కేంద్ర ప్రభుత్వం నొక్కి పెడుతుందని ఎన్ని రోజులు భరించగలను, సహించగలము, అది మన హక్కు పోరాడి సాధించుకోవాలి అని తెలియజేశారు. బిసి జాతి బానిసత్వాన్ని పోగొట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే కుల గణన చేయాల్సిందే అని మరియు భారతదేశ చరిత్ర పొడవునా విద్య ఆస్తి అధికారం అనే మూడు మానవహక్కుల ఉల్లంఘనకు గురైన అధికంగా వెనుకబడిన కులాలు అని దీనికి కారణం కుల గణన లేకపోవడమే అని తెలియజేశారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లో ఈ ఉద్యమం అలలు లాంటివి అని రాబోయే రోజుల్లో సునామీలు చూస్తారని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించి వెంటనే కులగనాన మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆలిండియా ఓ బి సి ప్రెసిడెంట్ కిరణ్ మాట్లాడుతూ దేశంలో సగానికిపైగా సుమారు 76 కోట్ల ఉన్న బీసీ కులాలు జనాభా లెక్కలను 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో చేయకపోవడం వల్ల దేశంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అసమానతను వివక్షతకు గురి అవుతున్నది చేయకపోవడం వల్ల సమాజంలో ఉన్న కులాలకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడం వల్ల కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ మరియు obc హక్కుల పరిరక్షణ ఫోరం ఆళ్ల రామకృష్ణ మరియు ఇతరులు పాల్గొన్నారు.