ఈ ఆర్ధిక సంవత్సరం లో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీలకు పెద్ద పీట వేయాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బిసి దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. బీసీ బిల్లుకు 14 పార్టీలు పార్లమెంట్‌లో మద్దతిస్తున్నాయన్నారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల వ్యతిరేక వైఖరి ఉండకూడదని, బీసీలు సామాజికంగా, ఆర్ధికంగా,రాజకీయంగా వెనుకబడి ఉన్నారని , బీసీల సంక్షేమం కోసం అన్ని విధాలుగా వారికి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బిసిల ఓట్లతో గెలిచే ప్రభుత్వాలు బిసి అభివృద్ది కి తోడ్పడలాని లేని పక్షాన కోట్లాడి సాధించుకుంటాం అని ఈ సంధర్భంగా తెలియ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా కేవలం వెయ్యి కోట్లు కేటాయించటం అన్యాయమన్నారు. ప్రధానిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీ ఉన్నారు కాబట్టి బీసీలంతా పోరాటం చేస్తే హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. ప్రైవేట్ రంగంలోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై దాడులు అరికట్టేందుకు బీసీ సామాజిక భద్రత చట్టం తీసుకురావాలని, బిసిల అభివృద్ది విస్మరిస్తే దేశంలోని అన్ని బీసీ సంఘాలను ఐక్యం చేసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని జాతీయ బిసి దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన దుండ్ర కుమారస్వామి
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్,శేర్లింగంపల్లి జోనల్...
Read more