తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ చిట్యాల ఐలమ్మ గారి 125వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం చాకలి ఐలమ్మ అని కొనియాడారు, ఆమె త్యగాలవల్లే నేడు సంపూర్ణ తెలంగాణ వాదం, స్వేచ్చ ఉన్నాయని తెలిపారు.అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు.ఐలమ్మ చేసిన భూపోరాటం లో విజయం పొంది పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు అని చాకలి ఐలమ్మ జీవిత విశేషాలను నెమరు వేసుకున్నారు.తరాలు , మారినా, కాలం మారినా చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి దాయకం అని కుమార స్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ అర్జున్, శివ , ఇతరులు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more