మాదాపూర్: తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, మాదాపూర్ లో సోమవారం ఉదయం ఇనార్బిట్ మాల్ సమీపంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా,అతి వేగంగా ఆడి కారు ఆటోను ఢీ కొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మరణించినట్టు సైబరాబాద్ పోలీసులు మంగళవారం తెలిపారు.
ప్రమాదం CCTV footage ను విడుదల చేశారు.ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. కారు నడిపిన వ్యక్తితో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు.