‘వైద్యో నారాయణ హరి’ అన్న పెద్దల మాటలకు అచుగుద్దినట్లు సరిపోయే వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి డా. రాహుల్ చేతన్. కరోనా మహమ్మారి భయపెడుతున్నా, ఒక వైపు ధైర్యంగా వైద్య సేవలు అందిస్తూ, మరోవైపు లాక్ డౌన్ నేపధ్యంలో సామాజికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందిస్తూ, నిరంతర సేవలు అందిచడం వీరి మానవతా దృక్పధాన్ని చెప్పకనే చెబుతుంది. ఎందరో నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేసి ఆకలి తీర్చిన సేవాతత్పరుడు డా. రాహుల్ చేతన్. మూడో కంటికి తెలియకుండా సేవ చేయడం, రెండో చేతికి తెలియకుండా దానం చెయ్యడం డాక్టరు గారి నిరాడంబరత్వానికి నిలువుటద్దం. హంగూ ఆర్భాటాలు లేకుండా సేవ చేసుకుంటూ పోవడం ఒక్కటే డాక్టరు గారికి తెలిసిన విద్య. పరోపకారార్ధం ఇదం శరీరం అనే మాటలను నమ్మడమే కాకుండా నిత్యం ఆచరిస్తున్న డా. రాహుల్ చేతన్ గారికి ‘ జాతీయ వైద్యుల దినోత్సవం’ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందరో అభాగ్యుల ప్రాణాలను, మరెందరో నిర్భాగ్యుల జీవితాలను కాపాడే మా మంచి డాక్టరు గారు అందుకోండి హృదయ పూర్వక శుభాభినందనలు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more