ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ వార్డ్ కార్యాలయం నందు డివిజన్ పార్టీ కార్యకర్తలతో డివిజన్ యస్ సి సెల్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. బిఆర్ అంబేద్కర్ బాల్యం నుండి కష్టపడి పైకి వచ్చారని అంటరానితనాన్ని నిర్ములించటానికి అయన ఎంతగానో కృషి చేసారని,తన బాల్యం లో తాను పడిన అవమానాలు గుర్తచేసుకుని రాబోవు కాలం లో ఎవరు కూడా అటువంటి అవమానాలకు గురి కాకూడదాని,పేద వర్గాలకు చెందిన దళిత బిడ్డల కోసం ఆయన ముందుకు రావటం జరిగిందని దేశానికీ రాజ్యాంగం ని రాసిన గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు అని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వారి ఆశయాలను ముందు పెడుతూ తెలంగాణ అసెంబ్లీ కి కూడా డా. బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని,అలాగే దళిత బిడ్డలను ద్రుష్టి లో పెట్టుకుని వారి అభివృద్ధి కొరకు దళితబందు పధకం ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి పాటుపడుతున్నారని తెరాస ప్రభుత్వం దళిత బిడ్డలకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ వారిని ప్రోత్సహాహిస్తు పది లక్షలు తో వారికి ఉపాధి కలిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కో ఆర్డినేటర్ వీరా రెడ్డి ,డివిజన్ మహిళా ప్రెసిడెంట్ పార్వతమ్మ, యస్ సి సెల్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్,బాబా షరీఫ్ ,సంపత్ రెడ్డి,మస్తాన్ రెడ్డి,శివ,రవీందర్ రెడ్డి ,సత్యమ్మ,లక్ష్మి ,లక్ష్మి,వెంకమ్మ,యస్ సి సెల్ సభ్యులు పార్టీకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more