తొలిపలుకు న్యూస్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీసాయి ఫంక్షన్ హల్లో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 కిపైగ మంది యువకులు రక్త దానం చేశారు. ఈసందర్భంగా ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ..
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. అలాగే ప్రాణపాయ స్థితిలో రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కొల్పుతున్నారు అని, తలసేమియా బాధితులకు ప్రతి నెల రక్తం మార్చాలి కావున ప్రజలు తమవంతు బాధ్యతగా రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు.. ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చి రక్తదానం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర, మాల్యా నాయక్, రామ్మోహన్, హారిక, తదితరులు పాల్గొన్నారు.