ఈ వ్యాధి లక్షలో ఇద్దరికీ వచ్చే అరుదైన వ్యాధి
శేరిలింగంపల్లి: తలనొప్పి,తల తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు మియాపూర్ మాతృశ్రీ నగర్ మెడికేర్ ఆస్పత్రి వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు డాక్టర్లు. నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన విజయ చాలాకాలంగా తల తిరగడం, తలనొప్పి ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చూపించుకుని ఆపరేషన్ చేయించుకున్నా ప్రయోజనం లేకుండా పొయింది.అయితే ఇటీవల మియాపూర్ మాతృశ్రీనగర్ లో ఉన్న మెడికేర్ ఆస్పత్రిలో చేరిన పేషెంట్ విజయకు ఆస్పత్రిలో న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి, క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రసాద్, అనస్తీషియా డాక్టర్ హరికృష్ణలు రోగిని పరిశీలించి ఆమె మెదడులో 6.6 సెంటీమీటర్లు(మెదడులో నాలుగవ వంతు భాగం) కణతి ఉన్నట్లు నిర్దారించారు. ఆమెకు సుమారు 5 నుండి 6 గంటల పాటు శ్రమించి ఆ కణతిని తొలగించారు. ప్రస్తుతం పేషేంట్ విజయ ఆరోగ్యంగా ఉందని మెడికేర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ రాజు తెలిపారు. తక్కువ ఖర్చుతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, కార్పొరేట్ ఆస్పత్రి అయినా అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పేషేంట్ విజయ, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.