సిద్దిపేట: సిద్దిపేట లో రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, పందిళ్ళ వాగు, ఎల్లమ్మ వాగు, గౌరవెల్లి, అక్కన్నపేట, మండలపిల్లి వాగు తంగళ్ళపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగు, పోరెడ్డి పల్లి బ్రిడ్జి, బస్వాపూర్ గ్రామం తదితర చెరువులను హుస్నాబాద్ ఎసిపి ఛార్జ్ అడిషనల్ డిసిపి మహేందర్ గారు, హుస్నాబాద్ సీఐ రఘుపతి రెడ్డి కోహెడ ఎస్ఐ రాజకుమార్, అక్కన్నపేట ఎస్ ఐ రవి తదితరులు కలిసి సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి మహేందర్ మాట్లాడుతూ… కల్వర్టులు, వాగులు, చెరువులు, బ్రిడ్జిల పైనుండి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలెవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని, వాటన్నిటికీ ఇరువైపులా చెట్ల కొమ్మలు, ముళ్ళ పొదలు, రోడ్స్ స్టాపర్, ప్లాస్టిక్ కోన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు వాహనదారులు పోలీసుల సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. వరద ఉధృతిని దాటే ప్రయత్నంలో విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు. పోలీస్ అధికారులతో మరియు సిబ్బంది తో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 24 గంటలు గ్రామాల సర్పంచులు తో ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు నీటి ఉధృతి నీ గురించి సమాచారం తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.