• నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కర్నూలు (తొలిపలుకు న్యూస్) : సెప్టెంబర్ 18 న గణేష్ నిమర్జనం జరగనున్న సంధర్బంగా జిల్లా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భారీ బందోబస్తు చర్యలు చేపట్టిందని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతవరణంలో శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ తెలిపారు.


ఈ సంధర్బంగా మొదటగా బయలు దేరే రాంబోట్ల దేవాలయ వినాయక విగ్రహం నుండి ఒన్ టౌన్ , గడియారం ఆసుపత్రి, అంబేద్కర్ సర్కిల్ , రాజ్ విహార్ మరియు నిమజ్జనం చేసే వినాయక్ ఘాట్ లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ తో పాటు డిఎస్పీలు వెంకటాద్రి, కెవి మహేష్, సిఐలు కళావెంకటరమణ, పార్ధసారథి రెడ్డి, తబ్రేజ్, గణేష్ ఉత్సవ సమితి కమిటి సభ్యలు పాల్గొన్నారు.