దీపావళి పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మియాపూర్ డివిజన్ పరిధిలోని చిన్నారులకు ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి బీజేపీ నేత గుండె గణేష్ ముదిరాజ్ ఆదివారం రోజు క్రాకర్స్ పంచిపెట్టారు. మన తెలుగు పండుగలలో ముఖ్యంగా చిన్నారులతో పాటు పెద్దవారు కూడా ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగా సందర్భంగా ఆర్ కె వై టీమ్ తరుపున కొంత వరకైనా సాయం చేయాలనే దృక్పథంతో ఈ క్రాకర్స్ ను పంపిణీ చేశామని గణేష్ ముదిరాజ్ తెలిపారు. అందరిజీవితాల్లో వెలుగులు నింపాలని,సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్,జాజెరావు శ్రీను,రాము, చంద్రారెడ్డి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more