జ్యోతిరావు పూలె జయంతి పట్ల వివక్షత తగదు……
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పాలమూరు యూనివర్సిటీలొ అధికారికంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడాని నిరసిస్తూ వీసి ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.సంఘ సంస్కార్త,కులవివక్షతకు , మహిళా విద్యా వ్యాప్తికై ,అణగారిన వర్గాలపై చూపిస్తున్నా వివక్షతకు వ్యతిరేకంగా నిమ్మవర్గాలను చైతన్యం చేసిన గొప్ప సంఘ సంస్కార్తలు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు ఇట్లాంటి మహాత్ముడి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలొ అధికారికంగా జరుగుతున్నా పాలమూరు యూనివర్సిటీ యంత్రాంగం మాత్రం ఈ రోజుకి అధికారికంగా ప్రకటన చేయలేదు. దీని నిరసిస్తూ బీసీ విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.వెంటనే యూనివర్సిటీలొ బీసీ సెల్ ఏర్పాటు చేయాలని వెంటనే అధికారిక ప్రకటన చేసి జ్యోతిరావు పూలే జయంతిని చేయాలని డిమాండ్ చేసారు. వీసీ స్పందిస్తూ వెంటనే జయంతి కార్యక్రమ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలొ పులిందర్ గౌడ్ హరికృష్ణ రంజిత్ ఆంజనేయులు ఉపేందర్ నరసింహ చారి శ్రీను,శివ రజినీకాంత్ శోభన్, సన షాహిన్ చందన సంరిన్,లహరి రేణుక మమతా స్వాతి తదితరులు పాల్గొన్నారు.