చందానగర్ డివిజన్ బీజేపి అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి ఆద్వర్యంలో నేడు పండిట్ దీన్ దయాల్ గారి 106వ జయంతి సందర్భంగా,తార నగర్ బతుకమ్మ కుంట లో మొక్కలు నాటి,వారి చిత్రపటానికి పూమాల వేసి ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది,బీజేపీ నాయకులు పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏకాత్మ మానవతవాదం ప్రతిపాదించి,సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించిన మహోన్నత వ్యక్తి , జన్ సంఘ్ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని అన్నారు,ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్ , బీజేపి సీనియర్ నాయకులు చిన్నం సత్యనారాయణ,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మరియు ఇతరులు పాల్గోన్నారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more