రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం- చరిత్రాత్మ కం నిర్ణయం -జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా….రాష్ట్రంలో కులగణన చేపట్టడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం …
చరిత్రాత్మ కం నిర్ణయం అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కుల గణన విషయంలో తీసుకున్న నిర్ణయం దేశానికి ఆదర్శమని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం తో సాధ్యమని ఈ నిర్ణయంతో నిరూపితమైందన్నారు.
సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన విషయంలో తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం అనె విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నేత వెంకటస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.
