హైదరాబాద్: తెలంగాణ లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న నేపద్యంలో, నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి తెలంగాణ లో 10 రోజుల పాటు లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు..
ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తూన్నారు. లాక్ డౌన్ నుండి మినహాయించిన అత్యవసర విభాగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే బయటికొస్తున్న పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ లో మొత్తం రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. అందులో భాగంగా సెక్రెటేరియట్ రోడ్లన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని ఆపి వివరాలు అడుగుతున్నారు. వారు అత్యవసర విభాగానికి చెందిన వాళ్లైతేనే పంపింస్తున్నారు. అదే విధంగా మీడియా వాళ్ళని కూడా, వాళ్ళ యొక్క ఐడెంటి కార్డు చూసాకే వారిని అనుమతిస్తున్నారు. లాక్ డౌన్ మొదటి రోజు సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.