అడ్డగూడూరు: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి జిల్లా, అడ్డగూడూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలే పాక అబ్బులు సైన్యం దళిత ఆవేదన సభకు బయలుదేరింది. దలిత మహిళ అయినటువంటి మరియమ్మని దొంగతనం కేసులో అరెస్ట్ చేసి, పాశవికంగా కొట్టి చంపిన నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరిగారి ప్రీతం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు, మండలంలో కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందని, అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగంలో దళితుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సభకు బయలుదేరే ముందు, అడ్డ గూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు, అబ్బులు సైన్యం నివాళులు అర్పించి బయలుదేరారు. దళిత ఆవేదన సభకు ముఖ్య అతిథిగా హాజరైన నితిన్ రావత్ దళితుల విషయాలపై మాట్లాడారు. ఏసిసి కార్యదర్శి ఇ.సంపత్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నాగరిగారి ప్రీతం, ఎస్సీ స్టేట్ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొని దళితుల కోసం ప్రసంగించారు.
ఈ సమావేశానికి బయలుదేరిన కాంగ్రెస్ ఎస్సీ సైన్యం మద్దతుగా మండల సీనియర్ నాయకుడు వల్లంపట్ల రవీందర్ మరియు లక్ష్మీ దేవి, కాల్వ సర్పంచ్ గంగరాజు, మంజుల వెంకటేష్. పండు, చంటి, నరేష్, సురేష్, ప్రశాంత్ ఎన్ ఎస్ యు ఐ. గుగెగ్గిల్లభారత్ తదితరులు సభకు హాజరయ్యారు.