ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర, ఓయూ జేఏసీ నేతలు బండారు వీరబాబు, మంద సురేష్ ఆధ్వర్యంలో దళిత బంధు పథకం పై సదస్సు ను ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహించారు. ఈ సదస్సు లో ఎస్సి కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మెన్ ప్రొ. లింబాద్రి లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎస్సి కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ… దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసమే దళిత బంధు పథకం ఆవిష్కృతం అయ్యిందన్నారు. దళిత బంధు పథకం చాలా గొప్పదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం కూడా ప్రవేశ పెట్టనటువంటి పథకమన్నారు. భాజపా, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు కాని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. దళిత బంధు పథకం
తెలంగాణలో మాత్రమే కాకుండా, యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి, దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. పథకం విజయవంతం అయ్యేందుకు పట్టుదలతో అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.గణేష్, ఓయూ పాలకమండలి సభ్యులు ప్రకాష్, పెర్క శ్యామ్, ప్రొ. రవి నాయక్, వివిధ విద్యార్ధి సంఘాల నేతలు పాల్గొన్నారు