రంగారెడ్డి జిల్లా తొలిపలుకు న్యూస్:
పోలీస్ శాఖలో అవినీతిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దృష్టి సారించారు. ఇప్పటికే అంతర్గతంగా కమీషనరేటు పరిధిలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిశితంగా పరిశీలించిన సీపీ తొలి వేటు వేశారు. తీవ్రమైన భువివాదాలు, అవినీతి ఆరోపణలలో భాగంగా నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్, ఎస్ఐ లక్ష్మణ్ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఇప్పటికే పలు ఆరోపణలతో వివాదాస్పదంగా ఉన్న సైబరాబాద్ పరిధిలోని అధికారు ల గుండెల్లో గుబులు మొదలైంది.