బిఆర్కేఆర్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి ఈటల రాజేందర్ గారు. కొవిడ్ వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
25ఏళ్లు పైబడిన వారికి కూడా కొవిడ్ టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారి దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు స్పందించలేదన్నారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరతలేదు..
కొవిడ్ చికిత్సకు ఐసీఎంఆర్ స్పష్టమైన ప్రొటోకాల్ ఇచ్చింది. గతంలో 10.. 12 రోజులకు లక్షణాలు కనిపించేవి. కానీ సెకండ్ వేవ్‌లో 2..3 రోజులకే తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ 300 నుంచి 350 టన్నుల వరకు అవసరమయ్యే ఆస్కారముంది అని తెలిపారు..