సృజనాత్మక కళలు ఎంతో ముఖ్యం
సృజనాత్మక చిత్ర కళల ప్రదర్శన అందరి మనుసులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.సహజ సిద్ధమైన గొప్ప నైపుణ్యం గల చిత్ర కళాకారుల, వారి ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ఈ ప్రదర్శన అని తెలిపారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మజ్దా ఆర్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్ట్ఎగ్జిబిషన్, చిత్రకళ ప్రదర్శనను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్లే ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, డాక్టర్ హరి కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు