ఈ రోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృతను పరామర్శించడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మరియు పల్లా వెంకటరెడ్డి ,సిపిఐ ఎక్స్ ఎమ్మెల్యే గుండా మల్లేష్,సిపిఐ రాష్ట్ర సెక్రటరియేట్ మెంబర్ పశ్య పద్మ , బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు/ఎడిటర్ తొలి పలుకు పత్రిక -దుండ్ర కుమారస్వామి వెళ్లడం జరిగింది .
ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆమెకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ప్రణయ మరణానికి కారకులను కఠినంగా శిక్షించాలని ,ఈ కుల వ్యవస్థ అనే మహమ్మారిని మనం ముగింపు పలకకపోతే , ఇది మన భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా చేయక మానదు అని ,సిపిఐ పార్టీ పూర్తి మద్దతు, సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశాడు.