బొడుప్పల్: 7విడత హరితహారం, 3 వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా, ఈ రోజు బొడుప్పల్ 11 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్త శ్రీవిద్యచక్రపాణి గౌడ్ మరియు మాజి వైస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్ పాల్గొని డివిజన్ లో రోడ్డులకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారం క్లిన్ చేయించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…
డివిజన్ లోని కాలనీ వాసులందరు పోయిన హరితహారం మొక్కలను శ్రద్ధతో పెంచారని, కాలనీ వాసులను అభినందించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ మరియు పకృతి వలన ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. అందరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు, అలాగే తిరుమల మెడవన్స్ కాలనీలో కొత్తగా వేస్తున్న రోడ్డు నెంబర్ 1 ను అధికారులతో మరియు కాలనీ వాసులతో కలిసి పరిసిలించారు. అలాగే కాంట్రాక్టర్ తో పనిలో నాణ్యత ఉండాలని, డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జి.జగదీశ్వర్ రెడ్డి ,సంతోష్ రెడ్డి , సిరుముళ్ల శ్రీనివాస్, ఇల్లూరి శ్రీనివాస్ గుప్త ,మెడిశెట్టి వెంకట్ గుప్త,గోవిందరాజులు, సత్తయ్య,మరియు మహిళలు ధర్మవతి,జమున రెడ్డి,లావణ్య పాల్గొన్నారు..