మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని,తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్..
ఈరోజు డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తైన చోటా సీసీ రోడ్లు అభివృద్ధి పనులు చేపట్టాలని చందనగర్ ఈ.ఈ శ్రీకాంతి గారు,శ్రీమతి.స్రవంతి గారు,డి.ఈ మాదాపూర్,శ్రీ.ప్రశాంత్ ఏ.ఈ మాదాపూర్,శ్రీ.ధీరజ్ ఏ.ఈ హఫీజ్ పేట్ గారితో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు..