- చిల్కానగర్ డివిజన్ లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ విస్తృత పర్యటన.
- అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గంలో నిన్న కురిసిన భారీ వర్షానికి చిల్కానగర్ డివిజన్ లోని పలు బస్తిలలో, కాలనీలలో భారీ వర్షం కురవడంతో ఇళ్లల్లోకి నీళ్ళు చేరడం జరిగింది. పలు కాలనీలో పొంగిపొర్లుతూ రోడ్లు మొత్తం నీటి మయం కావడంతో, ఈరోజు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అధికారులతో ఆయ బస్తిలో పర్యటించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలైన మల్లికార్జున నగర్, కళ్యాణ్ పూరి మరియు బీరప్పగడ్డ లో GHMC మరియు వాటర్ వర్క్స్ అధికారులతో గల్లీలని సందర్శించడం జరిగింది.
కార్పొరేటర్ గీతా ప్రవీణ్ అధికారులకు మాన్సూన్ టీమ్లను మరియు ఎయిర్ టెక్ వెహికల్స్ ని వెంటనే రంగంలోకి దించి ఆయా సివరేజ్ లైన్లను మరియు నాలాలను క్లీన్ చేయించడం జరిగింది. వర్షాకాలంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలలో ఏ సమాచారం వచ్చిన వెంటనే అందుబాటులో ఉండి సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, GHMC అధికారులు EE నాగేందర్, AE రాజ్ కుమార్, వాటర్ వర్క్స్ అధికారులు డిజిఎం శ్రీధర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, వి బి నరసింహ, మాస శేఖర్, కోకొండ జగన్, సుందర్, బింగి శ్రీనివాస్, బాలు,శ్రీకాంత్, శ్యామ్ అశోక్ చారి మల్లికార్జున్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు కళ్యాణపురి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నరేష్ మొదలగు వారు పాల్గొన్నారు