బొడుప్పల్ : తెలంగాణ, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో రోజు రోజుకు మహమ్మారి ఉదృతి పెరగడం వలన ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రతి రోజు ఈ పరిస్థితి గురించి సమగ్రంగా ఆలోచిస్తూ, సమన్వయంతో ముందుకు సాగుతూ, ప్రజలకు తన వంతుగా సహాయం అందించాలనే సంకల్పంతో, ఒకవైపు ఇంటింటికీ జ్వరం సర్వే చేయిస్తూ, ఎవరికైనా జ్వరం ఉన్నవాళ్లకు మందుల కిట్లు పంచుతూ, జ్వరం లేనివారికి మీ మీ ఇళ్ళల్లోనే జాగ్రత్తలు పాటిస్తూ జీవించాలని చెబుతూనే, మరోవైపు 22వ డివిజన్ పరిదిలోకి మహమ్మారి చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, ఇంటింటికీ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తూ, ప్రతి వాడ వాడకు బ్లీచింగ్ పౌడర్ ను చల్లిస్తూన్నారు 22వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దొంతర బోయిన మహేశ్వరి గారు…
ఈ సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమములో చురుకుగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మిక సిబ్బంది జవాన్ సుధాకర్, కార్మికులు బిక్షపతి, అనిల్, ప్రసాద్, మైసమ్మ, శోభ తదితరులను మహేశ్వరి మనస్ఫూర్తిగా అభినందించారు. ఈకార్యక్రమంలో ఎల్లప్పుడూ మన సమస్యలను తన సమస్యగా భావించే మహాజ్ఞాని మన ప్రియతమ తెరాస నాయకుడు శ్రీ దోంతర బోయిన కృపా సాగర్ ముదిరాజ్ గారు మరియు తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.