నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలు వస్తూ ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పారు. నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్ వంటి బడా కంపెనీలు రావడం అన్యాయమని దుండ్ర కుమారస్వామి అన్నారు. ‘రిలయన్స్ సెలూన్స్’ పేరుతో ఏర్పాటు చేయనున్న సెలూన్ల వలన ఎంతో మంది నాయీ బ్రాహ్మణుల పొట్ట కొట్టినట్లు అవుతుందని.. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. నాయీ బ్రాహ్మణుల కులవృత్తిని దెబ్బతీయటానికి కార్పొరేట్ శక్తులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు. రిలయన్స్ ముసుగులో రాష్ట్రంలో సెలూన్‌లు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నామని.. నాయీ బ్రాహ్మణుల కుల వృత్తికి ఆటంకం కలిగిస్తూ ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా వాటిని అడ్టుకుంటామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి నాయీ బ్రాహ్మణ సోదరులకు అండగా నిలబడాలని దుండ్ర కుమారస్వామి కోరారు. నాయీబ్రాహ్మణుల కులవృత్తి లోకి కార్పొరేట్ సంస్థలు అడుగు పెడితే, తమకు జీవనాధారం లేకుండా పోతుందన్నారు. తమ వృత్తిలోకి పెట్టుబడిదారులు ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కులవృత్తులపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు.. కార్పొరేట్ కంపెనీలకు మద్దతునివ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు దుండ్ర కుమారస్వామి. తెలంగాణ రాష్ట్రంలోని 75 వేల కటింగ్ షాపుల్లో రెండు లక్షలకు పైగా పని చేస్తున్నారని, దాదాపు 10 లక్షల మందికి ఈ వృత్తే జీవనాధారమని.. ఇప్పటికే ప్రైవేటు సెలూన్లు రావడంతో నాయీబ్రాహ్మణుల షాపులు నడవక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో రిలయన్స్ వంటి బడా కార్పొరేట్ సంస్థ వస్తే మాత్రం నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్ తో పాటు ఇతర కార్పొరేట్ సెలూన్లను కూడా నిషేధించాలని దుండ్ర కుమారస్వామి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more