హైదరాబాద్ ఏప్రిల్ 14 -గాంధీబాబు న్యూస్
నియోజకవర్గ పరిధిలో నిత్యావసర సరుకుల కోసం పంపిణీ చేసేందుకు తాను ఎల్లవేళలా సిద్ధం కొప్పుల నరసింహారెడ్డి అని తెలియజేశాడు. వైరస్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొప్పుల నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు .మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని విజయ శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన స్థానికులు నుద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు .కరోనా మహమ్మరి వల్ల దేశవ్యాప్తంగా అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండి ఆరోగ్య పరిరక్షణకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు .వృథాగా బయటికి వెళ్లి రోగాలు కొని తెచ్చుకోవడం కంటే స్వీయ నియంత్రణ పాటించి ప్రతి ఒక్కరూ పరిపూర్ణ వంతంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు .నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రాంతాల్లోనైనా సరే కష్టాలు పడుతున్న వారికి అన్ని విధాలా ఆదుకోవాలని తాను ముందుంటానని గుర్తు చేశారు .నిత్యావసర సరుకుల కోసమని తనకు నేరుగా ఫోన్ చేస్తే వారికి సకాలంలో అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు.రాజకీయాలకు తావులేకుండా కరోనా వైరస్ కట్టడికి అన్ని వర్గాలు తమ వంతు పాత్ర వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు .కరోనా ప్రభావం వల్ల రోజువారి కూలీలకు మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా తాము ఆ యా వర్గాలను ఆదుకోవాలన్న సదాశయంతో ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు .ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు నర్సిరెడ్డి మోహన్ రెడ్డి రాజేష్ శ్యామ్ సుందర్ రెడ్డి కొండలరావు మసూద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more