ఉప్పల్: రోజున ఉదయం 10 గంటలకు, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి శ్రీ జీ ఉదయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై ఉంటున్న యాచకులు/బిచ్చగాళ్ళు పది మందిని ఉప్పల్ పోలీస్ స్టేషన్ సీఐ రంగస్వామి, ఎస్ ఐ మహమ్మద్ అలీ ఇతర కానిస్టేబుల సహకారము తో 10 మంది యాచకులును పట్టుకొని ఉప్పల్ ప్రభుత్వ దవాఖాన లో టెస్ట్ చేయించగా అందులో ఒకరికి పాజిటివ్ గా తేలింది మిగిలిన తొమ్మిది మంది యాచకులకు నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినా వ్యక్తిని ఐసోలేషన్ కొరకు రామంతపూర్ హోమియోపతి హాస్పిటల్ కి తరలించారు. నెగిటివ్ వచ్చిన మిగతా తొమ్మిది మంది యాచకులను శామీర్ పేట అనాధ ఆశ్రమానికి తరలించారు.

ఈ కార్యక్రమాలలో పానెల్ లాయర్ సీనియర్ న్యాయవాది సత్యనారాయణ, పారా లీగల్ వాలంటీర్ గట్టు సాయి కృష్ణ, రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ సీనియర్ అసిస్టెంట్ సీతారామరాజు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ సిఐ రామస్వామి, ఎస్సై మహమ్మద్ అలీ, కానిస్టేబుల్ లు, DWO హనుమంతు మరియు మేడ్చల్ DWO సైదులు పాల్గొన్నారు.