హైదరాబాద్: కరోనా రోగులకు సైబరాబాద్ పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. కరోనా సోకిన రోగులకు అవసరమైన ప్లాస్మా దానం చేయడానికి అందరు ముందుకు వచ్చేలా ప్లాస్మాదానం పై అవేర్ నెస్ కల్పిస్తున్నారు సీపీ సజ్జనర్ & టీం. అందుకు గాను వందమంది కి పైగా వాలంటీర్లతో ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసారు సీపీ సజ్జనర్..
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సీపీ సజ్జనర్.. ప్లాస్మా అవసరమైన వాళ్ళు 9490617440 కు ఫోన్ చేయవచ్చు మరియు ప్లాస్మా కోసం https://donateplasma.scsc.in ను క్లిక్ చేయవచ్చును..