ప్రపంచ వ్యాప్తంగా కరోన కరాళ నృత్యం చేస్తూ కలవరపెడుతోంది. మన పక్క రాష్ట్రం ఆయిన మహారాష్ట్ర పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటం చూసి తెలంగాణలో పరిస్థితి చెయ్యి దాటిపోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ అధికారులను అలెర్ట్ చేస్తూనే ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వ సూచనలను బేఖాతరు చేస్తూ మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు.
1000 రూపాయలు చలాన్ కట్టడానికైనా సిద్ధపడుతున్నారు కానీ 10 రూపాయల మాస్క్ మాత్రం పెట్టుకోవడం లేదు అంటే చూడండి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ ప్రజలు. ఈ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ లో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా కట్టడి చెయ్యడంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ, వారం రోజుల్లో కరోనా కంట్రోల్ కాకపోతే ఎక్కువ శాతం కేసులు నమోదై మహరాష్ట్ర ని మించిపోయి హైదరాబాద్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లైనా లేకపోవడం బాధాకరం.
ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన నెంబర్ 1 దేశమైన భారతదేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడి సరఫరా సరిగ్గా లేకపోవడం శోచనీయం. దేశంలో ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్న పరిస్థితి. వ్యాక్సిన్ సరిపోక మరణాల సంఖ్య రోజు రోజుకు వేలల్లో పెరుగుతూ ఉంటే, దీన్నే అదునుగా తీసుకున్న ప్రయివేట్ హాస్పిటల్స్ లక్షల్లో డబ్బులు దన్నుకోవడంలో బిజీ అయ్యారు. దీనితో ప్రభుత్వ హాస్పిటల్స్ లో పడకలు లేక ప్రయివేట్ హాస్పిటల్స్ లో డబ్బులు పెట్టలేక, సరైన వైద్యం అందక చనిపోయిన వారిని పూడ్చేందుకు శ్మశానం లో స్థలం లేక పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అన్ని రాష్ట్రాలకు సరిపోయేలా ఎక్కువ శాతంలో వ్యాక్సిన్ పంపిణి చేసి ప్రజలందరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు అన్ని రాష్ట్రాల ప్రజలు..