రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. కొనరావుపేట మండలం నాగరం గ్రామంలో 60లక్షల రూపాయలతో కోదండ రామస్వామిని దర్శించుకొని ఆలయ పునరుద్దరణ పనులకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు,మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ
ఎమ్మెల్యే రమేష్ బాబు కామెంట్స్:
- -మొట్టమొదటిసారి 100% విద్యుత్ అందించే ప్రక్రియ కోనరావుపేట మండలం నుండే మొదలైంది.
- కోనరావుపేట పోరాటాల గడ్డ. ఇక్కడి నుండే ఎన్నో భూపోరాటలు ప్రారంభమయ్యాయి.
- భూస్వామ్య కుటుంబమైనాప్పటికి సాయుధ రైతాంగ పోరాటం చేసిన నాయకుడు రాజేశ్వరరావు.
- దున్నేవడికి భుమికవలని,కౌలు దారుల చట్టం కోసం అసెంబ్లీలో పోరాడిన వ్యక్తి.
- కోనరావుపేట మండలం సస్యశ్యామలం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.
- కోనరావుపేట కోనసీమ గా మారుతుందంటే ఎద్దేవా చేశారు.
- మల్కపేట రిజర్వాయర్ తో కోనరావుపేట మండలం సస్యశ్యామలం అవుతుంది.
- నాగారం గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది.
- గ్రామస్తులంతా కలిసి కట్టుగా ఆలయాన్ని కాపాడుకుంటూ వచ్చారు.
- ఈ ప్రాంతంలోనే మంచి దేవాలయం గా ప్రసిద్ధిచెందింది.
- చెన్నమనేని విద్యాసాగర్ రావు కి నాగారం పైన అపారమైన ప్రేమ ఉంది.
- ఈ దేవాలయ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు.
- ఊట చెరువుతో చుట్టుపక్కల ప్రాంతమంతా సస్యశ్యామలం అయింది.
- ఇంకా 40 లక్షలతో ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా మారుస్తా.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కామెంట్స్:
- తెలంగాణ సాధించుకున్న తర్వాతనే ఆలయాలకు పునర్వైభవం.
- ఆంధ్ర వలస పాలనలో దేవాలయాలకు 33 శాతమే నిధులు.
- ఆలయాల పునర్నిర్మానాణికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి.
- నాగారం గ్రామానికి రావడం రెండవసారి.
- ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతోనే ఆలయానికి 60లక్షల నిధులు మంజూరు.
- సంవత్సర కాలంలో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి.
- 1200 కోట్ల తో యాదాద్రి ఆలయ నిర్మాణం.
- యాదాద్రి పునర్నిర్మాణం పూర్తయితే తెలంగాణనే ఒక చరిత్ర.
- రాజులు మహారాజులు నిర్మించని మహాదేవాలయం యాదాద్రి.
- కృష్ణ శిలలతో తెలంగాణ తిరుపతిగా యాదాద్రి.
- కాళేశ్వరం తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు పెరిగాయి.
- అదనపు 30 ఎకరాల తో రాజన్న గుడి చెరువులో గోదావరి జలాలు.
- మల్కపేట రిజర్వాయర్తో ఉదయ గోదావరి జిల్లాలను సంతరించెల కోనరావుపేట.
- దేవాలయాలలోనే మానసిక ప్రశాంతత.
- రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రంగా నాగారం.
- ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రాజరాజేశ్వర దేవస్థానం కి 400 కోట్ల బడ్జెట్.
- రానున్న రోజుల్లో సకల సౌకర్యాలతో రాజన్న ఆలయం.