తొలిపలుకు న్యూస్ (మంచిర్యాల) : మంచిర్యాల పట్టణంలో విశ్వనాధ్ ఆలయంలో మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారితో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుని 21 లక్షలతో నూతనంగ నిర్మించిన రేకుల షెడ్డును పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లలా భాగ్యలక్ష్మి గారు, చెన్నూరు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు గారు మరియు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, విశ్వనాధ ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.