తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. మెల్లమెల్లగా కాంగ్రెస్ కనుమరుగయిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ జాడ లేకుండా పోయింది. దాని బాటలోనే కాంగ్రెస్ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ షాకిచ్చారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు నిర్ణయించుకున్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సురేందర్ తెలిపారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more