- భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
ఉప్పల్: తెలంగాణ లో పెరిగిపోతున్న డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ సోమవారం ఉప్పల్ లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన విజయవంతమైంది. మేడ్చల్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కార్యక్రమం ఇంఛార్జి వేము నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
వినూత్నంగా ఎడ్లబండ్లు, సైకిళ్ళతో నాయకులు, కార్యకర్తలు ఉప్పల్ లో కదంతొక్కారు.
కార్యక్రమంలో ఉప్పల్, ఏఎస్ రావు కార్పొరేటర్లు రజితపరమేశ్వర్ రెడ్డి, శిరీషాసోమశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, మేకల శివ రెడ్డి, ,హరివర్ధన్ రెడ్డి ,తోటకూర జంగయ్య ,ఆగి రెడ్డి ,పసునుల ప్రభాకర్ రెడ్డి ,బోరంపేట కృష్ణ ,రాగిడి లక్ష్మ రెడ్డి ,రఘుపతి రెడ్డి ,తెల్కల మోహన్ రెడ్డి ,గిరిబాబు ,కొంపల్లి బాలరాజ్ ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ ,బోడుప్పల్ కార్పొరేటర్ నర్సింహా రెడ్డి ,అజయ్ యాదవ్ ,కిషోర్ ,బొమ్మకు కళ్యాణ్ ,గీత రెడ్డి ,ఉపేందర్ ,వెంకట్ రెడ్డి హరినాథ్ రెడ్డి ,వంగేటి ప్రభాకర్ రెడ్డి ,రవి చారి ,జాంగా చారి ,మజార్ ,భాస్కర్ ,ఐలీష్ యాదవ్ ప్రకాష్ ,పతి కుమార్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు పాల్గొన్నారు.