- భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..
ఉప్పల్ : తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, ఇంఛార్జి వేము నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు . మేడ్చల్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా ఎడ్లబండ్లు, సైకిళ్ళతో నాయకులు, కార్యకర్తలు ఉప్పల్ లో కదంతొక్కారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మ రెడ్డి,ఉప్పల్, ఏఎస్ రావు కార్పొరేటర్లు రజితపరమేశ్వర్ రెడ్డి, శిరీషాసోమశేఖర్ రెడ్డి, మేకల శివ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి , తోటకూర జంగయ్య , పాల్గొన్నారు.