మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లా కేంద్రంలో చేనేత మరియు జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్మించే సమీకృత చేనేత శిక్షణ మరియు ఉత్పత్తి భవనానికి మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ కమిషనర్ శ్రీమతి శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.