సమాజ సేవ ను తన ప్రథమ కర్తవ్యంగా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు
సమాజ సేవను తన ప్రథమ కర్తవ్యం గా భావించే సామాజిక వేత్త, బి సి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు శ్రీ దుండ్ర కుమారస్వామి గారు తన పుట్టిన రోజు వేడుకలను పేదలు, అనాథ పిల్లల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కూకట్పల్లి కే పి హెచ్ బి కాలని లోని మైత్రి అనాథ ఆశ్రమంలో పేద విద్యార్ధులకు పండ్లు, పుస్తకాలు, పెన్ లు బహుమతిగా అందజేశారు. పిల్లలు గొప్ప లక్ష్యం తో చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు పొంది తోటి వారికి సాయం చెయ్యాలని, సమాజంలో వారు వంటరి వారు కారని పిల్లలకు స్ఫూర్తి దాయక సందేశం ఇచ్చి వారిని ఉత్సాహ పరిచారు. అంతే కాకుండా అనేక కూడళ్లలో ఫుట్ పాత్ ల మీద అనాథలకు ఆహార పొట్లంలు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో బిసి దల్ ఉపాధ్యక్షుడు డిపి చారి, బీసీ దల్ ల రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయియాదవ్, సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ మరియు తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవ్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.